పాక్‌: ఇమ్రాన్‌ ఖాన్‌ భవితవ్యం తేలేది నేడే?

Chakravarthi Kalyan
ఇవాళ  పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్యూచర్ ఏంటో తేలిపోతుంది. ప్రతిపక్షాల అవిశ్వాసం తీర్మానంతో పదవిలో కొనసాగడం సందిగ్ధంగా మారింది. భవిష్యత్‌ కార్యాచరణపై వ్యవస్ధ తనకు మూడు అవకాశాలు ఇచ్చిందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అంటున్నారు. ఆయన ముందు  రాజీనామా చేయడం, అవిశ్వాసంపై ఓటింగ్‌ను ఎదుర్కోవడం లేదా ఎన్నికలకు వెళ్లడం ఈ మార్గాలు ఉన్నాయంటున్నారు.  విపక్షాల అవిశ్వాసం తీర్మానంపై పాక్‌ జాతీయ అసెంబ్లీలో ఇవాళ ఓటింగ్‌ జరగనుంది.
ఎన్నికలు ఉత్తమమైన మార్గంగా భావిస్తున్నానని ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు. రాజీనామా గురించి అసలు ఆలోచించడం లేదని ఇమ్రాన్‌ తెలిపారు. అవిశ్వాసంపై చివరి వరకు పోరాడాలన్నది ఇమ్రాన్ వ్యూహం. అయితే.. సొంత పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ నుంచి కొందరు ఎంపీలు విపక్షంలోకి  ఫిరాయించారు. అవిశ్వాస తీర్మానం వీగిపోయినా  ప్రభుత్వాన్ని నడపే ఆలోచన ఇమ్రాన్‌కు లేదని తెలుస్తోంది. మరి ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: