ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ కేసులో సాక్షి ప్రభాకర్ సెయిల్‌కు హార్ట్ అటాక్.. మృతి..!

N.ANJI

బాలీవుడ్ ప్రముఖ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వ్యవహారం గురించి అందరికీ తెలిసిన విషయమే. ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన ప్రభాకర్ సెయిల్ శుక్రవారం మధ్యాహ్నం హార్ట్ అటాక్‌తో ప్రాణాలు విడిచారు. ముహల్ ప్రాంతంలోని తాము అద్దెకుంటున్న అపార్ట్‌ మెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయాన్ని ప్రభాకర్ సెయిల్ లాయర్ తుషార్ ఖండారే అధికారికంగా వెల్లడించారు.


హార్ట్ అటాక్ వల్ల ఆయన ప్రాణాలు వదిలారని, మృతి చెందిన సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నట్లు తెలిపారు. మృతికి సంబంధించిన ఎలాంటి అనుమానాలు లేవని ఆయన పేర్కొన్నారు. కాగా, ప్రభాకర్ సెయిల్‌కి తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గ్రామంలో ఉన్న వీరి బంధువులు, సోదరులు వచ్చిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రభాకర్ కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, డ్రగ్ క్రూయిజ్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అవ్వగా.. మరో సాక్షి కేపీ గోసావికి సెయిల్ సెక్యూరిటీ గార్డుగా కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: