రష్యాను కట్టడి చేసేందుకు ఉక్రెయిన్ కొత్త వ్యూహం?
ఇకపై గెరిల్లా యుద్ధం ద్వారా రష్యా ఆధీనంలోనికి వెళ్లిన కీలక ప్రాంతాలను తిరిగి తమ స్వాధీనం చేసుకోవాలని ఉక్రెయిన్ భావిస్తోంది. రష్యా హస్తగతమైన ప్రాంతాల్లో త్వరలో గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభిస్తామని ఉక్రెయిన్ నిఘా వ్యవస్థ చీఫ్ చెబుతున్నారు. శత్రువుకు దొరకుండా దాడి చేసి తమ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఆయన అంటున్నారు. గెరిల్లా యుద్ధం చేసే సైన్యం మరొక సైన్యంపై రహస్యంగా దాడి చేసి పారిపోతుంది. సైనికులుసాధారణ ప్రజల మధ్యలోనే ఉంటూ అవకాశం వచ్చిన వెంటనే శత్రు సైన్యంపై దాడి చేసి మట్టి కరిపిస్తారు. గెరిల్లా దాడుల ద్వారా సైన్యాన్ని, పోలీసులను మాత్రమే టార్గెట్ చేసుకుంటారు.