పెగాసస్‌: ఏం పీక్కుంటారో పీక్కోండంటున్న టీడీపీ ఎమ్మెల్యే?

Chakravarthi Kalyan
పెగాసస్‌ వ్యవహారం ఇటీవల టీడీపీ మెడకు చుట్టుకుంటోంది. ఇటీవల చంద్రబాబు హయాంలో ఏపీ ప్రభుత్వం పెగాసన్‌ను కొన్నదని బెంగాల్ సీఎం మమత ఇటీవల ఆరోపించింది. దీనిపై వైసీపీ నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి..  అధికార యంత్రాంగం చేతుల్లో పెట్టుకుని పెగాసెస్ వ్యవహారం టీడీపీపై వైసీపీ విమర్శలు చేయటం సిగ్గుచేటు అంటున్నారు. కుల, మత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడంలో పీకే ఆరితేరిన వాడని.. పెగాసెస్ పై ఏం పీక్కుంటారో పీక్కోండని కామెంట్ చేశారు. పనికిరాని మద్యం, సారా కారణంగా రాష్ట్రంలో వెయ్యిమంది పైగా చనిపోయారని.. దీనిపై స్పందించని వైసీపీ.. తాడేపల్లి కి వచ్చే మద్యం ఆదాయం తగ్గుతుందనే పెగాసస్ అంశాన్ని బయటకు తీస్తున్నారని విమర్శించారు. మరి ఇప్పుడు ఈ టీడీపీ నేత ఇంత ఘాటుగా స్పందించారు కదా.. వైసీపీ ఏం చెబుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: