సూపర్ హీరో: పసివాళ్లకు మహేశ్ బాబు చేయూత..?

Chakravarthi Kalyan
సినిమా హీరో మహేశ్ బాబు మరోసారి తాను సూపర్ హీరోనని నిరూపించుకున్నారు. పసి పిల్లలకు ఇప్పటికే మహేశ్ బాబు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేయిస్తున్నారు. ఆయన ఇప్పుడు మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు.. రెయిన్‌బో హాస్పిటల్‌ వారి ప్యూర్‌ లిటిల్‌ హార్ట్స్‌ ఫౌండేషన్‌తో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నారు.  హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.10లోని రెయిన్‌బో ఆసుపత్రి ఉంది. ఇక్కడే ప్యూర్‌ లిటిల్‌ హార్ట్స్‌ ఫౌండేషన్‌ను  మహేశ్ బాబు ప్రారంభించారు.
అంతే కాదు.. మహేశ్ బాబు..  రెయిన్‌బో ఆసుపత్రిలో గుండె ఆపరేషన్లు చేయించుకున్న చిన్నారులతో కొద్ది సేపు గడిపారు. వారిని పేరు పేరునా పలకరించారు. వారికి చిన్న కానుకలు కూడా మహేశ్ బాబు అందించారు. ఈ ప్యూర్‌ లిటిల్‌ హార్ట్స్‌ ఫౌండేషన్‌ డాక్టర్ రమేశ్‌, డాక్టర్‌ నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో పనిచేస్తోంది. ఈ ఫౌండేషన్‌ తో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మహేశ్‌ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: