ఏపీకి ఎన్‌హెచ్‌పీసీ ఝలక్..?

Chakravarthi Kalyan

ఆంధ్ర ప్రదేశ్‌కు  జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ జలక్ ఇచ్చింది. నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు బకాయిలు చెల్లించాలంటూ లేఖ రాసింది. రేపటిలోగా రూ.390 కోట్ల పెండింగ్‌ బకాయిలు చెల్లించాలని ఎన్టీపీసీ కోరింది. బకాయిలు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించింది. రాష్ట్రంలో ఇప్పటికే వ్యవసాయానికి విద్యుత్‌ కోతలు తప్పడం లేదు.
 
కరెంటు కోసం పొలాల వద్దే రైతులు పడిగాపులు కాస్తున్నారు. కరెంటు ఎప్పుడొస్తుందో.. ఎప్పుడుపోతుందో తెలియదంటున్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల రైతులు సబ్‌స్టేషన్లను ముట్టడిస్తున్నారు. రొయ్యలు కాపాడుకునేందుకు రైతులు అద్దె జనరేటర్లు తెచ్చుకుంటున్నారు. ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో విద్యుత్‌ దొరక్కపోవడమే సమస్యకు కారణమని డిస్కంలు చెబుతున్నాయి. డిస్కంలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని విద్యుత్‌ అధికారులు చెబుతున్నారు. డిస్కంలకు కేంద్రం నుంచి రుణాలు రావట్లేదని అధికారులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీకి ఎన్‌హెచ్ పీసీ లేఖ రాయడం ఇబ్బందుల్లో  పడేసింది. ఏదోలా డబ్బు ఎడ్జస్ట్ చేసి బకాయిలు కట్టకపోతే.. కరెంటు కోతలు మరింతగా పెరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: