వావ్: మెట్రో ప్రయాణికులకు శుభవార్త..!!

N.ANJI

మెట్రో ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో శుభవార్తను అందించింది. దేశంలోనే మొదటిసారిగా మెట్రో రైలులో ఓజోన్ ఆధారిత శానిటైజషన్‌ను ట్రైన్‌లోని కోచ్‌లల్లో ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా నేపథ్యంలో ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు మెట్రో మరో ముందడుగు వేసింది. ఈ మేరకు మూడు పోర్టబుల్ ఓజోకేర్ మొబిజోన్ యూనిట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యూనిట్లు ట్రైన్ కోచ్‌లను పరిశుభ్రంగా ఉంచేందుకు దోహదపడుతాయి. కోచ్‌లో గాలితోపాటు ఉపరితాలను సైతం శానిటైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. హాస్పిటల్స్, హెల్త్ కేర్, ఫుడ్ ప్రాసెసింగ్. నీటి శుద్ధి తదితర సదుపాయాలు విరివిగా ఉపయోగించుకోవడానికి వినియోగించనున్నారు.


ఈ మేరకు గత కొద్ది నెలలుగా ఓజోకేర్ మొబిజోన్ యంత్ర సామగ్రి పనితీరుపై హైదరబాద్ మెట్రో రైల్ పరీక్షలు నిర్వహించింది. దీనికి అనుగుణంగా ఎన్‌ఏబీఎల్ ధ్రువీకృత పరీక్ష కేంద్రం శానిటైజేషన్ సామర్థ్యాన్ని పరిశీలించింది. ఈ పరిశీలనలో శానిటైజేషన్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిసిన తర్వాతే వాడుకలోకి తీసుకోస్తున్నారు. ఈ మేరకు మూడు ఓజోకేర్ మొబిజోన్ యంత్ర పరికరాలను వాడుకలోకి తీసుకొస్తున్నామని ఎల్ అండ్ టీ ఎంఆర్‌హెచ్ఎల్ ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. ఈ యంత్రం 99శాతం సూక్ష్మజీవులను చంపేస్తుందని, దీని వల్ల మెట్రో ప్రయాణం మరింత సురక్షితంగా ఉంటుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: