ఛీ..ఛీ.. వీడసలు మనిషేనా ?


ఆంధ్ర ప్రదేశ్ లో మహిళలు, బాలికల పై దాడులు నానాటికీ పెరుగుతున్నాయి. ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉన్న విజయవాడలో జరిగిన సంఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక బలవన్మరణానికి పాల్పడింది. ఎందుకో తెలుసా ?
విజయవాడ నగరంలో ఇటీవల జరిగిన కార్పోరేషన్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వినోద్ జైన్ అనే వ్యక్తి వేధింపులకు తాళలేక  తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక  ఆపార్ట్ మెంట్ పై నుంచి దూకి  ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులకు దొరికిన సూసైడ్ నోట్ ఆధారంగా బాలిక ఆత్మహత్యకు కారకుడైన వినోద్ జైన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక  బలవన్మరణానికి పాల్పడడానికి ముందు ఆపార్ట్ మెంట్ పై గోడ మీద దాదాపు ఇరవై నిమిషాల పాటు తిరుగాడినట్లు సిసిటి పుటేజీ ని పట్టి తెలుస్తున్నదని పోలీసులు మీడియాకు వివరించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నేత వినోద్ తనను వేధింపులకు గురి చేసినట్లు ఆ బాలిక తన సూసైడ్ నోటో లో పేర్కోనిందని పోలీసులు తెలిపారు. వినోద్ జైన్ తమ బాలికను రెండుమూడు మాసాలుగా వేధింపులకు గురిచేస్తున్నాడని, ఈ విషయం తమ బాలిక తన దృష్టికి తీసుకు వచ్చిందని మృతురాలి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ, ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మృతురాలి ఇంటికి చేరుకుని బాలిక తల్లితండ్రులను ఓదార్చారు. నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని  మంత్రి వెల్లంపల్లి బాలిక తల్లితండ్రులకు హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: