గిరిజన విద్యార్థినిపై పెద్దమనసు చాటిన కేటీఆర్..!

MOHAN BABU

 అటు పాలనలో తమదైన శైలిలో  పేదలకు అందుబాటులో ఉంటూ, తెలంగాణ బ్రాండ్లా దూసుకుపోతున్న టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటారు. ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ, తెలంగాణలో రోల్ మోడల్ గా నిలుస్తున్న మంత్రి కేటీఆర్  మరోసారి తన ఉదారతను చాటుకున్నారు ఒక విద్యార్థికి  జీవిత గమ్యం వైపు నడిపించే ఎలా చేశారు మంత్రి కేటీఆర్.

 ఇప్పటికే ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ, ప్రజలతో మమేకమై కష్టం వచ్చినవారికి నేనున్నానని భరోసానిస్తూ ముందుకు పోతున్న కేటీఆర్ ఈ గిరిజన విద్యార్థికి సహకారం అందించడం ఎంతో ఆనందదాయకం. గిరిజన కోయ విద్యార్థి అయినా శ్రీలత చదువులో మేటి. ఆమె కోయగూడెం నుంచి వారణాసి ఐఐటీలో  సీటు సంపాదించింది.  ఆమె ఐఐటీలో సీటు సాధించింది కానీ ఫీజులు కట్టడానికి ఇతర ఖర్చులకు చాలా ఇబ్బంది పడుతుందని తెలిసింది. ఈ విషయం మంత్రి కేటీఆర్ కు తెలియడంతో కోయ తెగకు చెందిన  ఆడకూతురు శ్రీలతకు  తన ఐఐటి  విద్యాభ్యాసానికి  పూర్తి బాధ్యత నేనే వహిస్తానని హామీ ఇచ్చారు. అనేక సవాళ్లను ఎదుర్కొని ఐఐటీ లో చేరిన శ్రీలత ఆమె లాంటి ఎంతో మంది ఆడపిల్లలకు స్పూర్తి దాయకమని కేటీఆర్ అన్నారు. ఇక్కడ ఓ మారుమూల గిరిజన  తండా లో ఉంటూ  వారణాసిలో సీటు సంపాదించడం సామాన్య విషయం కాదని  కనీసం చదువుకోవడానికి కూడా సరైన పరిస్థితులు లేక ఎన్నో ఇబ్బందులు పడి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి కోసం ఆ విద్యార్థి ఎంతో కష్టపడి ఉందని చివరికి వారణాసిలో సీటు సంపాదించి తన లాంటి లక్షలాది మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని కొనియాడారు. కృషి పట్టుదల సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు పెద్దపీట వేస్తుందని ప్రతి ఒక్కరు దీనిని ఉపయోగించుకోవాలని తెలియజేశాను. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: