కేంద్రం కీలక నిర్ణయం..రేషన్ షాపుల్లో ఎల్పీజీ సిలిండర్లు...?

రేషన్ షాపుల ద్వారా చిన్న ఎల్పిజి సిలిండర్ లను విక్రయించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే అధ్యక్షతన జరిగిన వర్చువల్ మీటింగ్ లో చిన్న సిలిండర్ల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. అంతేకాకుండా పలు చమురు కంపెనీలు పాల్గొన్నాయి. కాగా ఈ సమావేశంలో నే చమురు మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులు రేషన్ దుకాణాల ద్వారా చిన్న సిలిండర్ల విక్రయాల ప్రతిపాదనను ప్రోత్సహించారు.

ఆసక్తి ఉన్న రాష్ట్రాలకు ఈమేరకు సహకారం అందిస్తామని స్పష్టంచేశారు. కామన్ సర్వీస్ సెంటర్ సహకారంతో ఎఫ్పీఎస్ ప్రాముఖ్యత పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొన్నాయి. స్థానిక అవసరాలకు అనుగుణంగా సాధ్యాసాధ్యాలను సమీక్షించేందుకు సిఎస్సి తో సమన్వయం చేసుకుంటామని స్పష్టం చేశారు. ముద్రా రుణాన్ని  ఎఫ్పీఎస్ డీలర్లకు వర్తింపచేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దాని ద్వారా మూలధనాన్ని పెంచుకోవచ్చని స్పష్టం చేసింది.. రాష్ట్రాలు తమ రాష్ట్రంలో ఈ కార్యక్రమాలను చేపట్టి అవసరాలకనుగుణంగా పనిచేయాలని ఆహార కార్యదర్శి సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Lpg

సంబంధిత వార్తలు: