కుషీనగర్ ప్రత్యేకత ఏంటి ?

  కుషీనగర్  ప్రత్యేకత ఏంటి ?


బౌద్ద మతాన్ని ఆచరించే వారికి, బౌద్ద భిక్షువులకు ఇది నిజంగానే శుభవార్త.  బౌద్ద మత సృష్టి కర్త గౌతమ బుద్దుడు  మహానిర్వాణం పొందిన ప్రాంతం కుషినగర్. ఇది ఉత్తర ప్రదేశ్ లో ఉంది. ఈ  ప్రాంతానికి ఏటా  పెద్ద సంఖ్యలో బౌద్ద భిక్షువులు వస్తుంటారు. దేశ విదేశాలలోని సాధువులు ఇక్కడి వచ్చి బౌద్ద మత ప్రార్థనల్లో పాల్గోంటుంటారు. ఇక్కడ ఎక్కువ రోజలు గడుపుతుంటారు. అయితే వీరు ఈ ప్రాంతానికి రాకపోకలు సాగించాలటే చాలా వ్యయప్రాయాసలతో కూడిన పని. దీనిని నరేంద్ర మోడీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.  బౌద్ద బిక్షువుల రాకపోకలను సరళం చేసేందుకు ప్రయత్నించింది. ఆ క్రమంలో సఫలమైంది. దాదాపు 260 కోట్ల రూపాయల పైచిలుకు మొత్తం వెచ్చింది అక్కడ అంతర్జాతీయ ఎయిర్ పోర్టును  ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా హాజరయ్యారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దశాబ్దాలుగా భారత దేశంలో  బౌద్ధ క్షేత్రాలు నిరాదరణకు గురయ్యాయని తెలిపారు.  కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక  చాలా మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. ఉత్తర ప్రదేశలోని కుషినగర్ లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కావడం, అది  తన చేతుల మీదుగా ప్రారంభానికి నోచుకోవడం  చాలా సంతోషాన్ని కలిగిస్తున్నదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. నూతన ఎయిర్ పోర్టు వల్ల ఈ ప్రాంతానికి రెట్టింపు సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని  ప్రధాని తెలిపారు. ఫలితంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని,  స్థానికంగా చాలా మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని నరేంద్ర మోడీ తెలిపారు. ఇక్కడి  ప్రజల స్థిత గతులు మెరుగుపడే అవకాశం ఉందని కూడా ప్రధాన మంత్రి పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ గవర్నర్  ఆనందీ బన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా తో పాటు పలువురు పార్లమెంట్ సభ్యులు, ఎం.ఎల్.ఏలు పాల్గోన్నారు.  తొలి విమానం  దాదాపు 120 మంది బౌద్ద బిక్షులతో శ్రీలంక నుంచి కుషి నగర్ చేరుకుంటుందని విమానాశ్రయ వర్గాలు ప్రకటించాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: