సామాన్యుడికి మరో షాక్..త్వరలో గ్యాస్ ధరలతో చుక్కలు..?

త్వరలో సామాన్యుడికి మరో షాక్ ఇచ్చేందుకు కేంద్రం సిద్దం అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రం పెంచిన ధరలతో పెట్రోల్, డీజిల్ రేట్లు వంద దాటిన సంగతి తెలిసిందే. అయితే త్వరలో ఎల్ పీజీ గ్యాస్ ధర కూడా 1000కి చేరబోతున్నట్టు అంతర్గత వర్గాల సమాచారం. అంతే కాకుండా ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీ కూడా నిలిపివేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక ఇప్పటివరకు ఎల్పీజీ ధరల పెంపు పై అధికారికంగా ఎలాంటి వార్తలు రాకపోయినా ప్రభుత్వ అంతర్గత అంచనా ప్రకారంగా సిలిండర్ కోసం వినియోగదారుడు రూ.1000 వెయ్యి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని తేలిందట. అయితే ఉజ్వల పథకం ద్వారా సిలిండర్ లు పొందిన వారికి మాత్రం సబ్సిడీ ఇవ్వాలనే ఆలోచనలో కూడా కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిన కేంద్రం ఇప్పుడు ఎల్పీజీ ధరలను పెంచేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Lpg

సంబంధిత వార్తలు: