రాజీనామా లేఖ పంపిన గవర్నర్

రాజీనామా  లేఖ పంపిన గవర్నర్
రవీంద్ర నారాయణ్ రవి( ఆర్.ఎన్. రవి) ఇటీవలే తమిళనాడు గవర్నర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన  ఓ మాజీ ఐబి అధికారి. ఆయన  తన పదవికి రాజీనామా చేశారు. ఆశ్చర్యపోకండి ఇది నిజం. ఆయన రాజీనామా చేసింది తమిళవాడు గవర్నర్ పదవికి కాదు. ఇప్పటి వరకూ తాను నిర్వర్తిస్తున్న అనుసంధాన కర్త పదవికి. నాగాలాండ్ తిరుగుబాటు దళం ఎన్.ఎస్.సి.ఎన్ - ఐఎంతో  శాంతి చర్చలు జరిపే బృందంలో రవి సభ్యుడు. రవి 2014  నుంచి  ఈ శాంతి కవిటీ సభ్యుడిగా ఉన్నారు. 2019లో నాగాలాండ్ గవర్నర్ గా నియమితులైన తరువాత కూడా ఆయన తన  పదవిలో కొనసాగారు. కేంద్ర ప్రభుత్వం శాంతి కమిటీలో సభ్యుడిగా ఉండేందుకు అనుమతించింది కూడా. అయితే, ఏడాది కాలంగా ఎన్.ఎస్.సి.ఎన్ - ఐఎం ఈయనతో చర్చలు జరిపేందుకు నిరాకరించింది. తమ హక్కుల ఉద్యమాన్నినీరుగార్చేందుకు  రవి ప్రయత్నిస్తున్నారేది  ఉద్యమకారుల ప్రధాన ఆరోపణ. ఈ నెలలో జరిగిన గవర్నర్ ల మార్పుల్లో ఆర్.ఎన్. రవి నాగాలాండ్ నుంచి తమిళవాడుకు వచ్చారు.  ప్రమాణ స్వీకారం రోజునే ముఖ్యమంత్రి స్టాలిన్ పరిపాలనా దక్షుడు అంటూ కితాబిచ్చారు. అందరినీ ఆశ్చర్య చకితుల్ని చేశారు.  కేంద్ర ప్రభుత్వం ఇంటలిజెన్స్ బ్యూరో లో డైరెక్టర్ గా పదవీ విరమణ చేసిన ఎ.కే మిశ్రాను శాంతి చర్చల నిమిత్తం నియమించనున్నట్లు సమాచారం. మిశ్రా  పదవి చేపట్టేందకు  అనువుగా  రవి తన పదవిని త్యజించినట్లు తెలుస్తోంది. రవి తాను ఇంత కాలం నిర్వహించిన పదవికి రాజీనామా చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖకు లేఖ పంపారు.  ఆయన రాజీనామా ను హోం శాఖ వెంటనే ఆమోదించింది కూడా.
కాగా అస్సాం ముఖ్యమంతి హిమంత్ బిశ్వాస్ శర్మ, నాగాలండ్  ముఖ్యమంతి నీఫియు రియోలు ఎన్.ఎస్.సి.ఎన్ - ఐఎం ప్రధాన కార్యదర్శితో తాజాగా  చర్చలు జరిపారు. రవి 2015 ఆగస్టు 3 న శాంతి చర్చలపై ఒక ముసాయిదాను రూపొందించారు. దానిని ప్రధానమంతి నరేంద్ర మోడీ చేత ఆమోద ముద్ర వేయించారు. దాదాపు 80 దఫాల చర్చల అనంతరం ఈ ముసాయిదా ఒక రూపానికి వచ్చింది. కా్గా శాంతి చర్చల్లో ఇప్పటి వరకూ చెప్పుకో తగ్గ పురోగతి లేదు. తమకు ప్రత్యేక జెండా, అజెండా కావాలని నాగాలాండ్ వాసులు ప్రధానంంగాా  డిమాండ్ చేస్తున్నారు. దీనిని భారత ప్రభుత్వం అంగీకరించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: