హడావుడిగా గవర్నర్ వద్దకు టీడీపీ...? కారణం ఏంటి...?

నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  ఇంటి వద్ద జరిగిన ఘటనకు సంబంధించి టీడీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. జోగి రమేష్ తన అనుచరులతో కలిసి చంద్రబాబు ఇంటి మీద దాడికి వచ్చారని ఆరోపణలు చేసారు.  నేడు రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటి అయిన టీడీపీ బృందం దీనికి సంబంధించి పూర్తి ఆధారాలతో వెళ్ళినట్టుగా తెలుస్తుంది.
నిన్న చంద్రబాబు నివాసం వద్ద జరిగిన ఘటనపై గవర్నర్ కి టీడీపీ నేతల ఫిర్యాదు చేసారు. ఎమ్మెల్యే జోగి రమేష్ చంద్రబాబు ఇంటికి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ని గవర్నర్ కి అందచేసిన టీడీపీ నేతలు... దీనిపై చర్యలకు ఆదేశించాలని కోరారు. గవర్నర్ ని  వర్ల రామయ్య, అశోక్ బాబు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కలిసి ఆయనకు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: