జీవిత ఖైదు అంటే కఠిన కారాగార శిక్షే: సుప్రీం సంచలనం

సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్వీ రమణ సుప్రీం కోర్ట్ లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టడమే కాకుండా కోర్ట్ నుంచి వస్తున్న తీర్పులు కూడా సంచలనంగానే ఉన్నాయి. జీవిత ఖైదు అంటే కఠిన కారాగార శిక్ష అని.. సాధారణ జైలు శిక్ష కాదని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం. హిమాచల్‌ ప్రదేశ్‌, గౌహతి హైకోర్టులు ఇచ్చిన తీర్పులను సవాలు చేస్తూ.. దాఖలైన రెండు పిటిషన్లపై విచారణ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేసింది సుప్రీం కోర్ట్.
1983లో జీవిత ఖైదుపై ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ.. జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ బిఆర్‌ గవాయ్‌ లతో కూడిన ధర్మాసనం ఈ విధంగా వ్యాఖ్యలు చేసింది. జీవిత ఖైదు విషయంలో ఇప్పటికే చట్టం పూర్తి స్థాయిలో అమలులో ఉన్నందున పునః సమీక్షించాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: