వాళ్ళు మందేస్తే నేను చూస్తూ కూర్చోలేనుగా!

Chaganti
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ను కలిసిన మంత్రి గుమ్మనూరు జయరాం మద్యం అక్రమ రవాణా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు, దాదాగిరి చేయడానికి నేనేమీ అంతరాష్ట్ర స్మగ్లర్ వీరప్పన్ ని కాదన్న ఆయన పోలీసులు ఖాళీ ఇసుక ట్రాక్టర్లు పట్టుకుంటే వదిలేయండి అని చెప్పిన మాట వాస్తవమె కానీ నేను చెప్పిన దాంట్లో  ఎక్కడైనా దౌర్జన్యంగా మాట్లాడింది లేదని అన్నారు. ఇక  నా నియోజకవర్గం ఆనుకునే కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ఉంటుందన్న ఆయన మద్యం సేవించేవారు అక్కడికి వెళ్లి మద్యం తెచ్చుకుంటున్నారు..దీన్ని నేనెలా అడ్డుకోగలనని ప్రశ్నించారు, ఇక అర కిలోమీటర్ దూరంలోనే లో  ఇతర రాష్ట్రం మద్యం దొరుకుతుంటే కొందరు తీసుకుని వచ్చి తాగుతున్నారని, మద్యం ఏరులై పారుతుందంటే నేనేం చేయగలను? నేనేమైనా అదే పనిగా కాసుకుని కూర్చుంటానా? అని ప్రశ్నించారు. ఇక దందా దందా అంటున్నారు, ఏం దందానో నాకు అర్థం కావడం లేదని, సీఎంగా జగన్ ఉన్నంతవరకు నన్ను ఎవరూ ఏమీ చేయలేరని ఆయన అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: