మల్లన్నకు చుక్కెదురు .. నేటి నుంచి నాలుగు రోజులు?

Chaganti
క్యూ న్యూస్ అనే సంస్థ నడుపుతూ బెదిరింపులకు పాల్పడిన కేసులో అరెస్ట్ అయిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌కు సికింద్రాబాద్ కోర్టులో షాక్ తగిలింది. ఆయన తనకు బెయిల్ ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌ను సికింద్రాబాద్ కోర్టు కొట్టేసింది. అలాగే తీన్మార్ మల్లన్నను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేయగా, దానికి అయితే కోర్టు అంగీకరించింది, పోలీసుల అభ్యర్ధన మేరకు నాలుగు రోజుల పాటు తీన్మార్ మల్లన్నను పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. ఇక నేటి నుంచి నాలుగు రోజుల పాటు తీన్మార్ మల్లన్నను చిలకలగూడ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోనుని విచారణ జరపనున్నారు. అలాగే తీన్మార్ మల్లన్న కేసులో దాఖలైన రిట్‌ పిటిషన్‌పై కూడా హైకోర్టులో విచారణ జరగగా కింది కోర్టులో బెయిల్ అప్లికేషన్ పెండింగ్‌లో ఉన్న కారణంగా స్టే ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: