బాక్సింగ్ రింగులో కుప్పకూలి.. ఐదో రోజు దుర్మరణం!

Chaganti
ప్రొఫెషనల్ ఫైట్‌లో ఓడిపోయిన  టీనేజ్ బాక్సర్ ఐదు రోజుల తర్వాత మరణించింది, అమెరికాలో సంచలనంగా మారిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు లోకి వెళితే శనివారం మాంట్రియల్‌లోని జివిఎమ్ గాలా ఇంటర్నేషనల్‌లో మేరీ పియర్ హౌల్‌ తో జరిగిన నాల్గవ రౌండ్‌ లో మెక్సికన్ వెల్టర్‌ వెయిట్ జీనెట్ జకారియాస్ జపాటా (18) ఓడిపోయింది. జపాటా గురువారం జరిగిన పోరాటంలో నాకౌట్ అయిన ఐదు రోజుల తర్వాత మరణించినట్లు ఆమె ప్రమోటర్ వైవోన్ మిచెల్ తెలిపారు,  మాంట్రియల్‌లో శనివారం జరిగిన జివైఎం గాలా ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఈవెంట్‌లో జపాటా పాల్గొన్నారు, వెల్టర్‌ వెయిట్ మ్యాచ్‌లో నాల్గవ రౌండ్‌లో మేరీ పియర్ హౌల్‌ చేతిలో ఓడిపోయారు. హౌల్ నుండి లెఫ్ట్ అప్పర్ కట్ మరియు రైట్ హుక్ కారణంగా నాల్గవ రౌండ్లో జపాటా మూర్ఛ పోయింది. ఆమె మూర్ఛ వచ్చిన తర్వాత, ఆమె రింగ్ నుండి బయటకు వచ్చింది  దీంతో ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: