ఇదేం పోయే కాలం : రైల్లో అర్ధనగ్నంగా ఎమ్మెల్యే హల్చల్!

Chaganti
బీహార్ అధికార జనతాదళ్ యునైటెడ్ (జెడియు) ఎమ్మెల్యే గోపాల్ మండల్, తన విపరీత చేష్టలకు ప్రధాన వార్తల్లో నిలిచారు. ఆయన తాజాగా ఆయన కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి గోపాల్ మండల్ పాట్నా నుంచి ఢిల్లీ వెళ్తున్నప్పుడు ట్రైన్లో హల్చల్ చేశాడు. అందుతున్న సమాచారం ప్రకారం, పాట్నా-ఢిల్లీ తేజస్ రైలులో ప్రయాణిస్తున్న గోపాల్ మండల్, తన సహ ప్రయాణికులతో దుర్భాషలాడారని మరియు అండర్ వేర్‌లో రైలు బోగీలో తిరిగేందుకు నిరాకరించినందుకు వారిని కాల్చి చంపుతానని బెదిరించారని ఆరోపణలు వచ్చాయి. కో-ట్రావెలర్ ప్రహ్లాద్ పాశ్వాన్ ఎమ్మెల్యే లోదుస్తులతో రైలులో నడుచుకుంటూ వెళ్తున్నాడని ఆరోపించాడు. ముందు వారు ఎమ్మెల్యే అని తెలియదని, మేము నిరసన వ్యక్తం చేసిన తరువాత, గోపాల్ మండల్ కోపంతో తన తల్లి మరియు సోదరిని దుర్భాషలాడుతూ తన మీద దాడి చేయడం మొదలుపెట్టారని, ఇది మాత్రమే కాదు, తనను కాల్చివేస్తానని ఎమ్మెల్యే బెదిరించాడని ఆరోపించాడు, ఈ క్రమంలో RPF కి ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే కోచ్‌ని మార్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: