ఒకటో తారీఖున 'గ్యాస్' బాంబేసిన కంపెనీలు!

Chaganti
సెప్టెంబర్ నెల మొదటి రోజు, సామాన్యుడికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ నిబంధనల మేరకు పెట్రోలియం కంపెనీలు దేశీయ LPG సిలిండర్ల ధరలను మరోసారి పెంచాయి. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) సబ్సిడీ లేని 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధరను రూ .25 పెంచింది. అదే విధంగా కమర్షియల్ అవసరాలకు మాత్రమే వాడే 19 కిలోల కమర్షియల్   గ్యాస్ సిలిండర్ ధర రూ .75కి పెరిగింది. ఇప్పుడు ఢిల్లీలో 14.2 కిలోల LPG సిలిండర్ రూ. 884.5 అయింది. అయితే ఇంతకు ముందు రూ .859.50 లభించేది. ముందుగా ఆగస్టు 18 న, LPG సిలిండర్ ధర రూ. 25.50 పెంచిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఢిల్లీలో LPG ధర రూ. 834.50 నుండి రూ .859.50 కి పెరిగింది. 15 రోజుల్లో, సబ్సిడీ లేని LPG సిలిండర్ ధర రూ .50 పెరిగింది. కొత్త రేట్లు ఆలస్యం లేకుండా ఈరోజు నుంచే అమలులోకి వస్తాయని  పెట్రోలియం కంపెనీలు ప్రకటించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

lpg

సంబంధిత వార్తలు: