మల్లన్నకి రిమాండ్.. సూసైడ్ అటెంప్ట్ లేదన్న న్యాయవాది!

Chaganti
బ్లాక్ మెయిల్ కేసులో అరెస్టయిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ అనే వ్యక్తికి 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది. లక్ష్మీకాంత శర్మ అనే జ్యోతిష్యుడిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో తీన్మార్ మల్లన్నని నిన్న రాత్రి అరెస్టు చేయగా ఈరోజు ఉదయం సికింద్రాబాద్ కోర్టులో హాజరు పరిచారు. ఇక మల్లన్న మీద ఐపీసీ 306, 511 సెక్షన్స్ పెట్టడం ఏమిటని ఆయన తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫిర్యాదుదారుడు ఎలాంటి సూసైడ్ అటెంప్ట్ చేయలేదని కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్లగా కోర్టు పరిశీలిస్తామని పేర్కొంది. అయితే ఏడు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని చిలకలగూడ పోలీసులు కోరినట్లు తెలుస్తోంది. మరోపక్క తీన్మార్ మల్లన్న తరఫున న్యాయవాది ఉమేష్ చంద్ర బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు లభిస్తే ఆయన జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: