బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

తెలుగుదేశం పార్టీని ఆగస్ట్ నెల వెంటాడుతుంది. గతంలో అనుభవాలకు దగ్గరగా ఇప్పుడు ఆగస్ట్ నెలలో చోటు చేసుకోబోయే కొన్ని పరిణామాలు పార్టీ అధిష్టానాన్ని కలవరపెడుతున్నాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం పార్టీ కార్యకర్తలను, అధిష్టానాన్ని ఇబ్బంది పెడుతుంది. తాను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని మరో నాలుగు రోజుల్లో పార్టీకి రాజీనామా చేస్తా అని గోరంట్ల బుచ్చయ్య పార్టీ అధిష్టానానికి చెప్పినట్టుగా తెలుస్తుంది.
అది అలా ఉంటె... ఆగస్ట్ నెల వస్తుంది అంటే చాలు టీడీపీ ఇబ్బంది పడుతూనే ఉంటుంది. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. 1984 నాదెండ్ల, ఆ తర్వాత ఎన్టీఆర్ ను గద్దె దించడం, ముషీరాబాద్ కాల్పుల ఘటన, హరికృష్ణ సహా పలువురు కీలక నేతల మరణాలు అన్నీ కూడా ఈ నెలలోనే చోటు చేసుకుంటూ వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: