బిగ్ బ్రేకింగ్: జగన్ కు ఈడీ షాక్, మరో రెండు...?

ఏపీ సిఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుకి సంబంధించి సిబిఐ అధికారులు అలాగే ఈడీ అధికారులు దూకుడు పెంచారు. జగన్ అక్రమాస్తుల కేసులో మరో రెండు చార్జి షీట్లను ఈడీ అధికారులు దాఖలు చేసారు. వాన్ పిక్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసుల్లో ఈడీ ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. మనీలాండరింగ్ అభియోగాలతో ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన ఈడీ... గతంలో ఏడు చార్జ్ షీట్ లు దాఖలు చేసింది.
ఇదిలా ఉంటె జగన్ అక్రమాస్తుల కేసులో మంత్రి సబితను తొలగించవద్దని సిబిఐ  కోరింది. పెన్నా కేసులో మంత్రి సబిత డిశ్చార్జ్ పిటిషన్ పై సిబిఐ  కౌంటరు దాఖలు చేసారు. మంత్రిగా సబిత ప్రమేయంపై ఆధారాలున్నాయని సిబిఐ  పేర్కొంది. అభియోగాల నమోదు, డిశ్చార్జ్ పిటిషన్ పై పెన్నా ప్రతాప్ రెడ్డి విచారణ జరిపారు. నిమ్మగడ్డ ప్రసాద్ డిశ్చార్జ్ పిటిషన్లపై కౌంటరు దాఖలుకు సిబిఐ  గడువు కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: