లవ్లీనా ఇక నుంచి డిఎస్పి

Chaganti
బాక్సర్ లవ్లీనా ఇక నుంచి డిఎస్పి. తాజాగా జరిగిన టోక్యో ఒలంపిక్స్ 2020 బాక్సింగ్ గేమ్ లో బ్రాంజ్ మెడల్ గెలిచిన బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్‌. ఒలంపిక్స్ లో పెద్దగా అంచనాలు ఏమీ లేకుండానే సెమీ ఫైనల్ వరకు వెళ్ళింది. అయితే సెమీఫైనల్లో ఒడిన లవ్లీనా బ్రాంజ్ మెడల్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒలంపిక్స్ బాక్సింగ్ లో మేరీ కోమ్, విజేందర్ మెడల్ గెలిచిన మూడో వ్యక్తిగా లవ్లీనా రికార్డు సృష్టించింది. తాజాగా ఆమెకు అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ విశ్వ శర్మ డీఎస్పీ పోస్ట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె సొంతూరు గోలాఘాట్ వద్ద లవ్లీనా పేరు మీద స్టేడియం కడతామని చెప్పారు. ఆమె కోచ్ కు 10 లక్షల నగదు బహుమతిని నజరానాగా ప్రకటించారు. అంతేకాకుండా గౌహతి లోని ఓ రోడ్డుకు లవ్లీనా పేరు పెట్టబోతున్నట్టు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: