తొలిటెస్టు వర్షార్పణం

Podili Ravindranath
నాటింగ్ హామ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో విజయానికి కేవలం 157 పరుగులు చేయాల్సిన భారత్ ఆశలకు వరుణుడు గండి కొట్టాడు. చివరి రోజు కనీసం ఒక్క బాల్ కూడా పడకుండా వర్షం అడ్డుకుంది. 209 పరుగుల విజయ లక్ష్యంతో నిన్న రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా... వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. అయితే చివరి రోజు మరో 157 రన్స్ చేస్తే టీమిండియా గెలుస్తుంది. అయితే ఉదయం నుంచి జోరుగా వర్షం కురుస్తుండటంతో... ప్లేయర్లు పూర్తిగా డ్రస్సింగ్ రూమ్ కే పరిమితమయ్యారు. పలు మార్లు ఫీల్డ్ పరిశీలించిన అంపైర్లు... మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. దీంతో మ్యాచ్ డ్రా గా ముగిసింది. రెండవ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పోటీల్లో భాగంగా తొలి టెస్టు డ్రా గా ముగియడంతో... ఇరు జట్లకు చెరో నాలుగు పాయింట్లను ఐసీసీ కేటాయించింది. సెంచరీ వీరుడు ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: