తొలిరోజు భారత బౌలర్ల హవా

Podili Ravindranath
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ టోర్నీ తర్వాత జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత బౌలర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. నాటింగ్ హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియంలో  జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టుతో 183 పరుగులకే ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిధ్య జట్టుకు ఫస్ట్ ఓవర్ లోనే ఎదురుదెబ్బ తగిలింది. బూమ్రా బౌలింగ్ లో బర్న్ పరుగులేం చేయకుండానే పెవిలియన్ చేరాడు. డొమినిక్ సిబిల్, జాక్ క్రావెల్ కొద్దిసేపు పోరాడినప్పటికీ స్కోరు బోర్డుపై పరుగులు రాబట్టలేక పోయారు. జాక్ క్రావెల్ 27, సిబిల్ 18 రన్స్ చేసి అవుటయ్యారు. బెయిర్ స్టౌ జతగా నిలకడగా ఆడిన కెప్టెన్ రూట్... ఇంగ్లండ్ స్కోరును పరుగులెత్తించాడు. 29 రన్స్ చేసిన స్టౌ అవుటయిన వెంటనే మరో రెండు వికెట్లు కూడా పడిపోయాయి. 64 పరుగులు చేసిన రూట్ ను శార్దూల్ ఠాకూర్ పెవిలియన్ కు పంపాడు. 160 రన్స్ కే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లీష్ జట్టుకు చివర్లో శామ్ కర్రన్ కొద్దిసేపు రాణించడంతో ఇంగ్లండ్ స్కోరు 183 పరుగులకు చేరుకుంది. భారత బౌలర్లలో బూమ్రా 4 వికెట్లు తీయగా, మహ్మద్ షమీ 3, ఠాకూర్ 2, సిరాజ్ ఓ వికెట్ పడగొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: