యాస్ తుఫాన్ .. పలు రైళ్ల రద్దు

Mamatha Reddy
బంగాళాఖాతంలో యాస్ తుఫాన్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ తుఫాన్ దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈస్ట్రన్ రైల్వే ఈ నెల 24 నుంచి 29 వరకు రాళ్ల రాకపోకలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తుఫాన్ తీవ్రత అధికంగా ఉంటుంది అని కేంద్ర వాతావరణ శాఖా హెచ్చరికలతో ఈ చర్యలు చేపట్టింది రైల్వే శాఖ. గంటకు 165 కి.మీ వేగం తో గాలులు వీస్తూ తుఫాన్ వీస్తుందనే హెచ్చరికలతో పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల కు ముప్పు వాటిల్లబోతుంది. ముజఫర్ పూర్- యశ్వంత్ పూర్, గౌహతి-బెంగళూరు కంటోన్మెంట్, ఎర్నాకుళం-పాట్నా రూట్లలో వెళ్లే రైళ్లను రద్దు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: