ఆరేబియా తీరం కకావికలం..కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది సాహసం..!!

Madhuri
మహారాష్ట్ర, గుజరాత్‌ తీర ప్రాంతంపై తౌక్టే బీభత్సం సృష్టించింది. సోమారం రాత్రి ఇది గుజరాత్‌లోని పోరుబందర్‌ – మహువా మధ్య తీరం దాటింది. ఆ సమయంలో గంటకు సుమారు 185 కి.మీ.ల వేగంతో పెను గాలులు, 3 మీటర్లకు పైఎత్తున లేస్తున్న రాకాసి అలలు, అతి భారీ వర్షాలతో అత్యంత తీవ్ర తుపానును తలపించింది. ఇక, తౌక్టే తుపాను వల్ల కన్నడనాట తీరప్రాంత జిల్లాలు అతలాకుతలమయ్యాయి. పెనుగాలులు, అలల తాకిడికి మంగళూరు వద్ద అరేబియా సముద్రంలో చిన్న చేపల పడవ మునిగిపోయింది. మంగళూరు నుంచి 13 నాటికల్‌ మైళ్ల దూరంలో రాతిబండల మధ్య కోరమండల్‌ అనే టగ్‌బోట్‌లో 9 మంది మంగళూరు రిఫైనరీ కాంట్రాక్టు ఉద్యోగులు శనివారం నుంచి చిక్కుకున్నారు. రక్షించాలని వీడియో కాల్‌ ద్వారా విజ్ఞప్తి చేయడంతో సోమవారం కోస్టుగార్డు సిబ్బంది నౌకలు, ఒక హెలికాప్టర్‌తో చేరుకుని అందరినీ సురక్షితంగా కాపాడారు.  అరేబియా సముద్రంలో చిక్కుకున్న 9 మందిని 40 గంటల అనంతరం సురక్షితంగా కాపాడారు. వాళ్లని హెలికాప్టర్‌ ద్వారా మంగళూరుకు తీసుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: