ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య ఉద్రిక్తత..!!

Madhuri
జెరూసలేంలో కొన్ని వారాలుగా పాలస్తీనావాసులు, ఇజ్రాయిల్‌ భద్రతా దళాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. తూర్పు జెరూసలేం శివారులోని షేక్‌ జెర్రాలో పాలస్తీనా ప్రజల నివాసాలను ఇజ్రాయెల్‌ సెటిలర్లు ఆక్రమించుకోవడం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. ఆగ్రహంతో రగిలిపోతున్న పాలస్తీనియన్లు సోమవారం ఉదయం ప్రార్థనల సందర్భంగా ఇజ్రాయిల్‌ పోలీసులపై విరుచుకుపడ్డారు. దీంతో పవిత్ర నగరం జెరూసలేంలోని అల్‌–అక్సా మసీదు ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇజ్రాయిల్‌ పోలీసులు, పాలస్తీనా పౌరులు పరస్పరం ఘర్షణకు దిగారు. రాళ్లు విసురుతున్న పాలస్తీనావాసులను చెదరగొట్టేందుకు ఇజ్రాయిల్‌ పోలీసులు బాష్పవాయువు, రబ్బర్‌ బుల్లెట్లు, స్టన్‌ గ్రెనేడ్లు ప్రయోగించారు. ఈ ఘటనలో 305 మందికిపైగా పాలస్తీనియన్లు గాయపడ్డారు. వీరిలో 228 మంది చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. మొత్తం 20 మంది ఘర్షణల్లో మరణించారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: