లోకేష్‌కు ఫోన్ చేసిన కేసీఆర్

Garikapati Rajesh

తెలంగాణ‌లో క‌రోనా ఉధృత‌మ‌వుతుండ‌టంతో నియంత్ర‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ న‌డుంబిగించారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ క‌మిష‌న‌ర్ డీఎస్‌ లోకే‌ష్‌కుమార్‌కు ఫోన్‌ చేశారు. ఉద్యోగులందరికీ వ్యాక్సిన్లు వేయించాల‌ని సూచించారు. ప్రతి ఒక్క ఉద్యోగికి వ్యాక్సిన్‌ వేయించాలని, ఈ నెల 15వ తేదీలోగా ఆ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలంటూ లోకేష్‌కుమార్ త‌న కిందిస్థాయి అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఏ రోజుకారోజు వ్యాక్సిన్‌ తీసుకున్న వారి వివరాలను కేంద్ర కార్యాలయానికి పంపడంతోపాటు కొవిడ్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. జీహెచ్‌ఎంసీలో రెగ్యులర్‌ ఉద్యోగులు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులే కాకుండా కార్మికులు 30 వేల మంది ఉన్నారు. వీరిలో ఎక్కువ‌మంది కరోనా నియంత్రణ చర్యల్లో పాల్గొంటున్నారు. ప్ర‌తి జోన‌ల్ కార్యాల‌యం, అక్క‌డి అధికారి, అధికారి ప‌రిధిలో ఉండే సిబ్బంది అంద‌రూ టీకా వేయించుకోవాల‌ని లోకేష్‌కుమార్ ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: