బ్రేకింగ్‌: ఘోర రోడ్డు ప్ర‌మాదంలో 15 మంది మృతి

VUYYURU SUBHASH
అమెరికా-మెక్సికో సరిహద్దు సమీపంలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.  ఈ ప్ర‌మాదంలో 15 మంది అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. అమెరికాలోని ద‌క్షిణ కాలిఫోర్నియో - మెక్సికో స‌రిహ‌ద్దులోని స్టేట్ రూట్ 115 స‌మీపంలోని ఇంపీరియ‌ల్ కౌంటీలో ఓ కారును ట్ర‌క్కు బ‌లంగా ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో 14 మంది అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. బాధితులంతా 15 నుంచి 53 ఏళ్ల వయసున్న స్త్రీ, పురుషులు.

కారు సామ‌ర్థ్యానికి మించి ఎక్కువ మందిని ఎక్కించుకుని వెళుతుండ‌డం వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని అంటున్నారు. ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు వ్యానులో సుమారు 27 మంది వరకు ఉన్నట్లు స్తానిక బోర్డర్ డివిజన్ చీఫ్ ఆర్టురో ప్లేటెరో పేర్కొన్నారు. మృతుల్లో పది మంది మెక్సికన్‌ పౌరులు ఉన్నారని, ఇతరుల వివరాలు ఇంకా తెలియరాలేదన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: