కరోనాతో మాజీ సిఎం మృతి

కోవిడ్ అనంతర సమస్యలతో కాంగ్రెస్ అగ్ర నేత, మూడుసార్లు అస్సాం ముఖ్యమంత్రిగా  పని చేసిన తరుణ్ గొగోయ్ సోమవారం సాయంత్రం మరణించారు. 86 ఏళ్ల తరుణ్ గొగోయ్ వెంటిలేటర్ మీద చికిత్స తీసుకున్నారు. ఆయన ఆరోగ్యం విషమంగా మారింది అని వారం రోజుల క్రితం గౌహతి మెడికల్ కాలేజీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. రాజకీయాల్లో దాదాపు 50 ఏళ్ళ చరిత్ర ఉన్న నేత.
అస్సాం లో ఎక్కువ కాలం పనిచేసిన సిఎం తరుణ్ గొగోయ్ ఏప్రిల్ 1, 1936 న పూర్వపు శివ సాగర్ జిల్లాలోని రంగజన్ టీ ఎస్టేట్‌ లో జన్మించారు. 2001 నుండి 2016 వరకు వరుసగా మూడుసార్లు అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1997 లో, తరుణ్ గొగోయ్ రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించి, అస్సాం శాసనసభలో శాసనసభ సభ్యుడిగా (ఎమ్మెల్యే) ఐదు పర్యాయాలు పనిచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: