చాలా రోజులకు ప్రభుత్వంపై పరిటాల సునీత విమర్శలు ...!

గత కొన్నాళ్ళుగా తెలుగుదేశం పార్టీలో కొంత మంది నేతలు బయటకు రావడం లేదు. వారికి ఉన్న ఇబ్బందులు కారణంగా వారు బయటకు రావడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇక ఇదిలా ఉంటే తాజాగా... పరిటాల సునీత చాలా రోజులకు బయటకు వచ్చారు. మర్రిమాకులపల్లి గ్రామంలో  తీవ్రంగా గాయపడిన బాలుడు కార్తిక్ ను ఆస్పత్రిలో పరామర్శించిన మాజీ మంత్రి పరిటాల సునీత... రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసారు.  
బాలుడు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మర్రిమాకులపల్లి గ్రామ ప్రజలను ఒకలా ఇతర గ్రామస్తులను మరోలా చూస్తున్నారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద నాలుగు గ్రామాలు ముంపుకు గురైతే ఆ గ్రామంపై ఎందుకీ వివక్ష అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు... గ్రామస్తులను ఎందుకు విడదీస్తారు అని నిలదీశారు. మర్రిమాకుల పల్లి గ్రామంలో అర్హులైన వారందరికీ పునరావాస ప్యాకేజీ ఇవ్వాలంటూ ఆర్డీవో దృష్టికి  తీసుకుని వెళ్లారు ఆమె.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: