సరిహద్దులలో భారత్ జోరు.. ఏకంగా 44 వంతెనలు..!

Lokesh
దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ.. సరిహద్దుల్లో ఘర్షణలు సృష్టించేందుకు పాక్​, చైనా కుయుక్తులు పన్నుతున్నాయని మండిపడ్డారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. సరిహద్దు రహదారి సంస్థ (బీఆర్​ఓ)​ పూర్తి చేసిన కీలక వంతెనలను ప్రారంభించిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా కారణంగా దేశం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. వ్యవసాయ రంగం, ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక, జాతీయ భద్రత వంటి వాటిని తీవ్రంగా ప్రభావితం చేసింది కొవిడ్. మరోవైపు సరిహద్దుల్లో వివాదాలు సృష్టించేందుకు పాక్, చైనా కుట్రలు పన్నుతున్నాయి అని రాజ్​నాథ్​ సింగ్​ అన్నారు.


శత్రుదేశాల సమర్థంగా ఎదుర్కొనేందుకు వ్యూహాత్మక రహదారులు, వంతెనలను నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసింది భారత్. ఏడు సరిహద్దు రాష్ట్రాల్లో 44 కీలకమైన వంతెనలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు రక్షణమంత్రి. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ రహదారిలోని నిచేఫూ సొరంగ మార్గం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: