లేపాక్షి సిద్ధం.. ఇవే ఉపయోగించాలి ఇక మీదట..!

Lokesh
ఇక నుంచి అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పోరేషన్లు, కమిషనరేట్లు, జిల్లా కలెక్టరేట్లు, ప్రభుత్వ విద్యా సంస్థలు లేపాక్షి నంది బ్రాండ్​కు చెందిన పేపరు ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పోరేషన్​కు చెందిన లేపాక్షినంది బ్రాండ్ నోట్ పుస్తకాలు, జిరాక్సుల కోసం కాపియర్ పేపర్లు, కార్యాలయాల్లో స్క్రిబ్లింగ్ ప్యాండ్లను మాత్రమే కొనుగోలు చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఐఐఎం బెంగళూరు చేసిన సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించేందుకు ఈ కార్యాచరణ చేపట్టినట్టు ప్రభుత్వం పేర్కొంది. అంతర్జాతీయ వాణిజ్యం, స్థానిక పరిశ్రమల ప్రోత్సాహం, కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు, గోదాముల నిర్మాణం, కాగిత ఉత్పత్తుల తయారీ, లేపాక్షినంది బ్రాండ్ నోటు పుస్తకాలు తదితర ఉత్పత్తుల తయారీ కోసం.. ఏపీ స్టేట్ ట్రేడింగ్ కార్పోరేషన్​కు బదులుగా ఏపీ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పోరేషన్ పనిచేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: