ఇకపై భారతీయ విశ్వవిద్యాలయాలు అక్కడ కూడా..?

Lokesh
అంతర్జాతీయ స్థాయికి భారత విద్యా వ్యవస్థ​ ఎదిగేందుకు నూతన విద్యా విధానం(ఎన్​ఈపీ) ఉపయోగపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశంలో శక్తి వంతంగా మారిన విశ్వవిద్యాలయాలు.. విదేశాల్లోనూ తమ క్యాంపస్​ల​ను ఏర్పాటు చేసుకునే విధంగా ఎన్​ఈపీ తోడ్పడుతుందన్నారు. ఆత్మనిర్భర్​ భారత్​ను సృష్టించడంలో ఎన్​ఈపీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

అసోంలోని ఐఐటీ-గువాహటి స్నాతకోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పాల్గొన్నారు ప్రధాని మోదీ. విద్యా రంగంలో భారత హోదాను పెంపొందించేందుకు ఐఐటీ-గువాహటి కీలక పాత్ర పోషించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.యువత ఆలోచనలపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని మోదీ తెలిపారు. విద్యార్థులు కన్న కలలను నిజం చేసుకునే క్రమంలోనే దేశం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: