అది ఖచ్చితంగా కుట్రే...!

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లో లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో రథం కాలిపోవడం పై ఇప్పుడు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎంతో చరిత్ర ఉన్న రథం ఇలా కాలిపోవడం పై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవాలయ రథం కాలిపోవడం దురదృష్ట కరమని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. అంతర్వేది రథోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అని గుర్తు చేశారు. రథం కాలిపోయిన విధానం చూస్తుంటే ఒక కుట్ర ప్రకారం జరిగినట్లు అనుమానాలు కలుగుతున్నాయి అంటూ అనుమానం వ్యక్తం చేశారు.
 ఒక మతం పై జరిగిన దాడిలా ప్రజలు భావించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో వెల్లంపల్లి శ్రీనివాస్ కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరిగిన ఒక పిచ్చివాడు చేశాడంటూ కేసులు కొట్టేస్తున్నారు అని ఆయన ఆరోపించారు.  అలా కాకుండా విచారణ జరిపించి బాధ్యులెవరైన, ఏ మతస్థులైన కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న అని రఘురామకృష్ణంరాజు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: