సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఐటీబీపీ కానిస్టేబుల్ ఆత్మహత్య

praveen

22వ బెటాలియన్కు చెందిన సందీప్ కుమార్ అనే ఐటిబిపి కానిస్టేబుల్ సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విధుల నిమిత్తం సహచర సిబ్బందితో కలిసి కరోల్ బాగ్ పోలీస్ స్టేషన్కు చేరుకున్న సందీప్ కుమార్.. విధులు ముగిసి ఇంటికి వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు. 

 

 ఇంతలోనే తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్  తీసుకొని కాల్చుకున్నాడు. పక్కనే ఉన్న సహచరులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: