బీహార్ లో దారుణం.. పిడుగు పాటుతో 22 మంది మృతి

Edari Rama Krishna

ఈ మద్య దేశంలో ఒకటి కాదు రెండు కాదు వరుసగా చిత్ర విచిత్రమైన విపత్తులు వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ తో జనాలు విల విలలాడిపోతున్నారు.  ప్రతిరోజూ కేసులు పెరిగిపోతున్నాయి.. లాక్ డౌన్ పాటించినప్పటికీ కరోనా కేసులు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి. ఇది చాలదన్నట్లు ఈ మద్య మిడతలు, తుఫాన్లతో చచ్చిపోతున్నారు. తాజాగా బీహార్‌లో గత కొన్ని రోజులుగా ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ప్ర‌తిరోజూ ఉరుములు, మెరుపుల‌తో కూడిన జ‌ల్లులు ప‌డుతున్నాయి.

 

నేడు బీహార్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులుప‌డి 22 మంది మ‌ర‌ణించార‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. జిల్లాల వారీగా ఏయే జిల్లాలో ఎంత‌మంది మ‌ర‌ణించార‌నే వివ‌రాల‌ను జాతీయ విప‌త్తు నిర్వ‌హ‌ణ విభాగం వెల్ల‌డించింది.ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, బక్సర్‌లో నలుగురు, ఔరంగాబాద్‌లో ఇద్దరు, నలందలో ఇద్దరు, జుమ్రుయి స‌హా వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్క‌రు చొప్పున పిడుగుపాట్ల‌తో ప్రాణాలు కోల్పోయారని తెలిపింది.

 

అసమ్‌లో కాగా, బీహార్‌లో మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం కోరుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: