దుప్పట్లతో కరోనా ఖైదీలు జంప్...!

కరోనా దెబ్బకు ఇప్పుడు జైళ్ళు కూడా భయపడుతున్న సంగతి తెలిసిందే. చాలా మంది ఇప్పుడు  జైల్లో ఉన్న ఖైదీలు క్రమంగా కరోనా బారిన పడటం ప్రభుత్వానికి కూడా తల నొప్పిగా మారింది. వారికి ఏ విధంగా చికిత్స అందించాలి అన్నా సరే భద్రత చాలా అవసరం. ఇక తాజాగా ఒక పరిణామం చోటు చేసుకుంది. ఔరంగాబాద్‌లోని కోవిడ్ కేర్ సెంటర్ నుంచి పాజిటివ్ అని వచ్చిన ఖైదీలు వినూత్న రీతిలో పారిపోయారు. 

 

కిటికీ గ్రిల్స్‌ను వంచేసి, బెడ్‌షీట్లను తాడుగా ఉపయోగించి వారు పారిపోయారు. ఆదివార౦ రాత్రి సమయంలో వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకున్నారని అధికారులు ఒక ప్రకటనలో వివరించారు. ఇక ఈ ఘటనలో ఓ ఉద్యోగిని సస్పెండ్ కూడా చేశామన్నారు. బేగంపూర పోలీస్ స్టేషన్‌లో కేసును కూడా నమోదు చేశామని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: