హాట్ స్పాట్ లో ఫంక్షన్... పోలీసుల సీరియస్...!

ఒక పక్క కరోనా వైరస్ తీవ్రంగా ఉన్నా సరే ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఎక్కడో ఒక చోట ఏదోక కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. తాజాగా మహారాష్ట్రలో ఒక వ్యవహారం బయటకు వచ్చింది. కొవిడ్-19 హాట్‌స్పాట్‌గా గుర్తించిన ఔరంగాబాద్‌లోని సంజయ్ నగర్, ముకుంద్వాడి ప్రాంతాల్లో సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఒక వివాహ వార్షికోత్సవ వేడుక జరిగింది. 

 

ఈ రెండు అక్కడ కరోనా హాట్ స్పాట్ లు గా ఉన్నా సరే ఈ కార్యక్రమం నిర్వహించారు. వారి మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. ఐపీసీలోని పలు సెక్షన్లతో పాటు అంటువ్యాధుల నివారణ చట్టం కింద కేసులు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు. వారికి వార్నింగ్ ఇచ్చి వదిలేశామని పోలీసులు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: