ఆ దుర్ఘటనలు నా హృదయాన్ని కలచివేశాయి...అజయ్ దేవగన్ !!

Surya

నిన్న శుక్ర వారం జరిగిన విశాఖ ఎల్జీ పాలిమర్స్ దుర్గ్తన యావత్ భారత దేశాన్ని కలచివేసింది. ఈ దుర్ఘటనలో దాదాపుగా 10 మంది దాక చనిపోవడం జరిగింది . ఆ కంపెనీ నుండి రిలీజ్ అయిన విషవాయువు కారణంగా ప్రజలు అపస్మారక స్థితిలోకి వెళ్లారు, కొంతమంది వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతున్నారు. కొంత మందికి శరీరం పై దద్దుర్లు ఏర్పడి పరిస్థితి విషమంగా మారింది. అయితే ఈ సందర్భంగా పలువురు సినీతారలు ఆ ఘటనకు సంబంధించి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.

సింగం హిందీ రీమేక్ లో నటించిన అజయ్ దేవగన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తన ప్రగాఢ సానుభూతి తెలియజేసాడు..తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ...నిన్న జరిగిన విశాఖ సంఘటన నా హృదయాన్ని కలచివేసింది..అయితే నిన్న రాత్రి జరిగిన వలస కూలీలు రైలు పట్టాలపై చనిపోయిన దుర్ఘటన విని  చాల బాధపడ్డాను అయితే వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను ..అని తన ట్విట్టర్ ద్వారా తెలియ జేశాడు ....

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: