హెరాల్డ్ బర్త్ డే : 23-08-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen
ఆగస్టు 23వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో  తెలుసుకుందాం రండి.

 తేజ సజ్జ జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు తేజ  సజ్జ 1994 ఆగస్టు 23వ తేదీన జన్మించారు. బాలనటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన తేజ సజ్జ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఇంద్ర సినిమాలో చిన్నప్పటి చిరంజీవి పాత్రలో నటించిన తేజ... అభిమానులను సంపాదించుకున్నారు. తర్వాత కలిసుందాం రా అనే సినిమాలో కూడా బాలనటుడిగా ఎంతోమందిని మెప్పించాడు. ఇక ఇటీవలే సమంత ప్రధాన పాత్రలో నటించిన ఓ బేబీ సినిమాలో కీలక పాత్రలో నటించాడు తేజ.

 వాణి కపూర్ జననం : భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి వాణికపూర్ 1992 ఆగస్టు 23వ తేదీన జన్మించారు. ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు పొందిన కథానాయికల్లో వాణికపూర్ ఒకరు, కపూర్ ఫ్యామిలీకి చెందిన వాణికపూర్.. కథానాయకిగా  ఎన్నో సినిమాల్లో నటించి మంచి విజయాలను అందుకున్నారు. తనదైన  అందచందాలతో సోషల్ మీడియా వేదికగా కూడా ఎంతో మంది ప్రేక్షకులను అలరించారు వాణికపూర్.

 కృష్ణ కుమార్ జననం  : భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నేపథ్య గాయకుడు కృష్ణ కుమార్ 1970 ఆగస్టు 23 వ తేదీన జన్మించాడు. హిందీ బాషలోనే  కాకుండా తమిళ తెలుగు  భాషలో  కూడా ఎన్నో పాటలు పాడి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే పరిశ్రమలో  ప్రేక్షకులందరికీ కేకే గా  కొసమెరుపు. కేరళకు చెందిన కృష్ణకుమార్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో పాడి  తన గాత్రంతో ఎంతోమంది... అభిమానులను సంపాదించుకున్నారు.

 వినీత్ జననం : భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు వినీత్ 1969 ఆగస్టు 23వ తేదీన జన్మించారు. అయితే కన్నడ చిత్ర పరిశ్రమలో తన నట కెరియర్ను ప్రారంభించినప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు సంపాదించారు, తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ అయిన వినీత్ మలయాళం తమిళం తెలుగు కన్నడ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు,

 మోహన్ జననం : దక్షిణాది చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు మోహన్ 1956 ఆగస్టు 23వ తేదీన జన్మించారు.  తమిళ్ తెలుగు హిందీ మలయాళం భాషల్లో ఎన్నో చిత్రాలలో నటించిన మోహన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో టాప్ టెన్ నటులలో మోహన్ కూడా ఒకరు. ముఖ్యమైన పాత్రల్లో ఎన్నో  సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని  ఎన్నో అవార్డులు సైతం గెలుచుకున్నారు.

 టంగుటూరి  ప్రకాశం పంతులు జననం : సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మొదటి ముఖ్యమంత్రి అయిన ప్రకాశం పంతులు 1872 ఆగష్టు 23 వ తేదీన జన్మించారు. నిరుపేద కుటుంబంలో జన్మించి.. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు టంగుటూరి ప్రకాశం పంతులు. 40, 50 లలో  ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో టంగుటూరి ప్రకాశం పంతులు ఒకరు. అంతేకాదు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన లో ఎంతో కీలకపాత్ర పోషించారు. టంగుటూరి ప్రకాశం పంతులు కి ఆంధ్ర కేసరి అనే బిరుదు కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: