హెరాల్డ్ బర్త్ డే : 24-08-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen
ఆగస్టు 24వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు  జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో  తెలుసుకుందాం రండి.

 రాజ్ గురు జననం : ప్రముఖ భారత స్వాతంత్ర సమరయోధుడు ఉద్యమకారుడు  రాజ్ గురు  1908 ఆగస్టు 24వ తేదీన జన్మించారు. మహారాష్ట్రలో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఈయన భగత్ సింగ్ సుఖదేవ్ లకు సహచరుడిగా ఎంతగానో గుర్తింపు పొందారు. 1928లో లాలాలజపతిరాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ వారిపై పగ తీర్చుకోవడానికి... ఏకంగా  బ్రిటిష్ అధికారిని  చంపినందుకు  1931 మార్చి 23న భగత్ సింగ్ సుఖదేవ్ లతోపాటు ఉరితీయబడ్డారు రాజ్ గురు.

 అంజలి దేవి జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి అంజలి దేవి 1927 ఆగస్టు 24వ తేదీన జన్మించారు. అభినవ సీతమ్మగా తెలుగు చిత్ర పరిశ్రమలో  పేరొందిన అంజలీదేవి... నటిగా నిర్మాతగా ఆమె ప్రస్థానాన్ని ఎంతో విజయవంతంగా కొనసాగించారు. అంజలీదేవి అసలు పేరు అంజనీ కుమారి. నర్తకి కూడా ఎంతగానో గుర్తింపు సంపాదించారు. రంగస్థలంలో నటనా జీవితాన్ని ప్రారంభించిన అంజలీ దేవి... ఆ తర్వాత సినీ రంగంలో కూడా ఎన్నో పాత్రల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రముఖ నిర్మాత అయిన పి.ఆదినారాయణరావు ను పెళ్లి చేసుకున్నారు అంజలి దేవి.

 దాశరథి రంగాచార్యులు జననం : ప్రముఖ సాహితీ వేత్త తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అయిన దాశరధి రంగాచార్యులు 1928 ఆగస్ట్ 24వ తేదీన జన్మించారు. నైజాం రాజ్యంలో నిజాం పాలన కాలంలో జన్మించిన దాశరధి రంగాచార్యులు... ఆంధ్ర మహాసభ ఆర్య సమాజాలను  వేరువేరుగా నిజాం పాలనలో లోపాలను ఎదుర్కొంటున్న తీరుకు  ఆకర్షితులయ్యారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించారు.

 గీతామాధురి జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నేపథ్య గాయని గీతామాధురి 1985 ఆగస్టు 24వ తేదీన జన్మించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో గుర్తింపు ఉన్న ప్లేబ్యాక్ సింగర్స్ లో  గీతామాధురి కూడా మొదటి వరుసలో ఉంటారు. ఎన్నో అద్భుతమైన పాటలు పాడి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు గీతామాధురి. నచ్చావులే సినిమా లో పాడిన పాట తో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న గీతామాధురి ఈ పాటకు గాను నంది అవార్డును సైతం అందుకున్నారు. ప్రముఖ నటుడు నందు ని ప్రేమ వివాహం చేసుకున్నారు గీతామాధురి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: