హెరాల్డ్ బర్త్ డే : 25-08-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen
ఆగస్టు 25వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు  జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో  తెలుసుకుందాం రండి.

 ప్రియదర్శి జననం.  : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ హాస్యనటుడు ప్రియదర్శి 1989 ఆగస్టు 25 వ తేదీన జన్మించారు. ఎలాంటి  సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక సాదాసీదా నటుడిగా తన నట జీవితాన్ని ప్రారంభించిన ప్రియదర్శి... స్టార్ హీరోల సినిమాల్లో సైతం అవకాశాలను దక్కించుకున్నారు. పెళ్లి చూపులు సినిమాతో తన నట ప్రస్థానాన్ని ప్రారంభించి మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఆ తర్వాత ఎఫ్ 2 సినిమాలో నటించి తనదైన కామెడీ టైమింగ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాధేశ్యాం సినిమాలో కూడా ప్రియదర్శి నటిస్తున్నారు.

 దీప్తి నల్లమోతు జననం  : ప్రముఖ మీడియా లో న్యూస్ ప్రజెంటర్  గా పని చేసి ఎంతగానో గుర్తింపు సంపాదించిన దీప్తి నల్లమోతు 1986 ఆగస్టు 25వ తేదీన జన్మించారు. న్యూస్ ప్రజెంటర్  గా ఉన్న సమయంలో ఒక సాదాసీదా వ్యక్తి గా ఉన్న దీప్తి నల్లమోతు బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 కంటెస్టెంట్ గా వెళ్లి ఎంతగానో గుర్తింపు సంపాదించారు, అప్పటివరకు కొంతమందికి మాత్రమే తెలిసిన దీప్తి నల్లమోతు... బిగ్ బాస్ షో లోకి వెళ్ళిన తర్వాత... సెలబ్రిటీ హోదాను సంపాదించారు. తెలుగు రాష్ట్రాల  ప్రజలందరికీ సుపరిచితురాలు గా మారిపోయారు దీప్తి నల్లమోతు.

 తస్లీమా నస్రీన్ జననం : బంగ్లాదేశ్ కు  చెందిన ప్రముఖ రచయిత్రి స్త్రీవాద మానవ హక్కుల కార్యకర్త సెక్యులర్ వాది అయిన  తస్లీమా నస్రీన్ 1962 ఆగస్టు 25 వ తేదీన జన్మించారు. రచయితగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి సంపాదించిన తస్లీమా నస్రీన్... ముస్లిం ఛాందస వాదుల నుంచి ఎంతగానో ముప్పు ఎదుర్కొంటుంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చి  కలకత్తాలో నివాసం ఉంటుంది తస్లిమా  నస్రిన్ . 2008లో భారత్ ను  వదిలి  గుర్తు తెలియని ప్రదేశానికి వెళ్ళింది తస్లిమా  నస్రిన్ .

 దేవులపల్లి రామానుజరావు జననం : ప్రముఖ పాత్రికేయులు పత్రిక సంపాదకుడు ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాత అయిన దేవులపల్లి రామానుజరావు 1917 ఆగస్టు 25వ తేదీన జన్మించారు. తెలంగాణ విముక్తి పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని పోరాడిన సాహితీకారులు దేవులపల్లి. తెలంగాణలో శోభ గోల్కొండ పత్రికలకు సంపాదకుడిగా పనిచేసి ఎంతో  గుర్తింపు సంపాదించారు. చిత్తశుద్ధితో తెలుగు భాష సేవలో నిమగ్నమైన దేవులపల్లి... భాషను శాసించిన భాషా సాధకుడు అని చెబుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: