హెరాల్డ్ బర్త్ డే : 21-08-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen
ఆగస్టు 21వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు  జరిగాయి. మరొక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో  తెలుసుకుందాం రండి.


 రాధిక శరత్ కుమార్  జననం : ప్రముఖ నటి నిర్మాత అయిన రాధిక శరత్ కుమార్ 1963 ఆగస్టు 21వ తేదీన జన్మించారు. తమిళంలో తన సినీ కెరీర్ ని ప్రారంభించిన రాధిక ఆ తర్వాత మలయాళ హిందీ తెలుగు భాషల్లో కూడా ఎంతగానో గుర్తింపు సంపాదించారు. తమిళ తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా  దశాబ్ద కాలానికి పైగా పనిచేశారు రాధిక శరత్ కుమార్ . ఎన్నో  విజయవంతమైన సినిమాల్లో నటించి ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది రాధిక. శరత్ కుమార్ ని వివాహం చేసుకున్నారు. మొదటి పెళ్లి మళయాళీ డైరెక్టర్ ప్రతాప్ ని పెళ్లి చేసుకున్నారు. కేవలం హీరోయిన్ గానే కాకుండా ఆ తర్వాత కూడా ఎన్నో ముఖ్య పాత్రలో సినిమాల్లో నటించి తనదైన నటనతో మెప్పించారు.


 పెను పాత్రుని ఆదినారాయణ రావు జననం : తెలుగు సినిమా సంగీత దర్శకుడు నిర్మాత... ప్రముఖ నటి అంజలీ దేవి భర్త అయిన పెను  పాత్రుని ఆది నారాయణరావు 1914 ఆగస్టు 21వ తేదీన జన్మించారు. ఈయన  చిన్ననాడే శ్రీ రాజరాజేశ్వరి నాట్య మండలి వారి సావిత్రి నాటకం లో నారదుని పాత్ర పోషించారు. హార్మోనియం వాయిద్యాలలో ఎంతగానో శిక్షణ పొందారు. ఇక ఆ తర్వాత సి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన గొల్లబామ చిత్రానికి సంగీత దర్శకుడిగా చలన చిత్ర రంగ ప్రవేశం చేశారు ఈయన. ఇక అప్పటి నుంచి ఆయన సంగీత దర్శకుడు ప్రస్థానం ఎంతో విజయవంతంగా కొనసాగింది, 1953 లో అంజలి పిక్చర్స్ స్థాపించి... నిర్మాతగా కూడా తన సత్తా చాటారు. సంగీత దర్శకుడిగా నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించారు నారాయణ రావు .


 భూమిక చావ్లా జననం : భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి భూమిక చావ్లా 1978 ఆగస్టు 21వ తేదీన జన్మించారు. బాలీవుడ్ లో  మొదటగా తన నట ప్రస్థానాన్ని ప్రారంభించిన భూమికా చావ్ల ఆ తర్వాత తెలుగు తమిళ మలయాళ చిత్ర పరిశ్రమలో కూడా ఎంతగానో గుర్తింపు సంపాదించారు. 2003లో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన తేరే నామ్ అనే సినిమాలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు భూమిక చావ్లా. యోగ గురువైన భరత్ ఠాగూర్ ను  2007లో వివాహం చేసుకున్నారు. తెలుగు పరిశ్రమలో  యువకుడు సినిమాతో పరిచయమైన భూమిక చావ్లా తర్వాత ఖుషి మిస్సమ్మ ఒక్కడు సింహాద్రి లాంటి ఎన్నో సినిమాల్లో నటించారు . ఇప్పటికి కూడా సినిమాలో పలు కీలక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారూ  భూమిక చావ్లా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: