హెరాల్డ్ బర్త్ డే : 20-08-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen
ఆగస్టు 20వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే  ఎంతో మంది ప్రముఖుల జననాలు  జరిగాయి.  మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో  తెలుసుకుందాం రండి.

 పూసపాటి కృష్ణంరాజు జననం  : తెలుగు సాహిత్యంలో ప్రఖ్యాతి వహించిన కథారచయిత అయిన పూసపాటి కృష్ణంరాజు 1928 ఆగస్టు 20వ తేదీన జన్మించారు. విజయనగరం జిల్లా ద్వారపూడి లో జన్మించిన పూసపాటి కృష్ణంరాజు... ఎన్నో రచనలు రచించి ఎంతగానో గుర్తింపు సంపాదించారు. కేవలం రచనలు మాత్రమే కాకుండా... కథా సంపుటాలు కథలు ఎన్నో రచించారు పూసపాటి కృష్ణంరాజు. ఈయన  రచించిన కథా సంపుటాలు కథలు అన్ని ఎంతగానో ప్రేక్షకాదరణ పొందాయి.

 బి.పద్మనాభం జననం : ప్రముఖ తెలుగు సినిమా నటుడు రంగస్థల నటుడు సినీ నిర్మాత దర్శకుడు అయిన బి.పద్మనాభం 1931 ఆగస్టు 20వ తేదీన జన్మించారు. ఈయన పూర్తి పేరు బసవరాజు వెంకట పద్మనాభ రావు. చిన్నప్పటినుంచి పద్యాలు సంగీతం అంటే  తెగ ఇష్టపడే పద్మనాభం... రంగస్థల నటుడిగా  ఎంతో గుర్తింపు సంపాదించారు. ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు సంపాదించారు. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు పద్మనాభం. ఎన్నో  వైవిధ్యమైన పాత్రల్లో తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు.

 రాజీవ్ గాంధీ జననం : ఇందిరాగాంధీ ఫిరోజ్ గాంధీ  ల పెద్ద కుమారుడు.. ఇందిరా గాంధీ మరణం తో భారత దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి రాజీవ్ గాంధీ  1944 ఆగస్టు 20వ తేదీన జన్మించారు. గాంధీ నెహ్రూ కుటుంబం నుంచి రాజీవ్ గాంధీ మూడోవాడు. 1989 డిసెంబర్ 2న సాధారణ ఎన్నికల్లో పరాజయం పొందిన రాజీవ్ గాంధీ రాజీనామా చేసేంతవరకు ప్రధాన మంత్రిగా పనిచేశారు. కేవలం నలభై సంవత్సరాల వయసులోనే ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ.. భారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. రాజీవ్ గాంధీ  ప్రధానమంత్రిగా కొనసాగిన సమయంలో తనదైన సంస్కరణలతో పాలన సాగించారు.

వి రామకృష్ణ జననం : 1970 వ దశకంలో ఎంతగానో పేరొందిన తెలుగు సినిమా నేపథ్య గాయకుడు రామకృష్ణ 1947 ఆగస్టు 20వ తేదీన జన్మించారు. దాదాపు 200 సినిమాల్లో  5 వేలకు పైగా పాటలు పాడి ఎంతగానో గుర్తింపు సంపాదించారు, ఇక తనదైన గాత్రంతో సంగీత ప్రేమికులందరికీ ఉర్రూతలూగించారు రామకృష్ణ . తెలుగు చిత్ర పరిశ్రమలో మైలురాళ్ళ లాంటి ఎన్నో సినిమాల్లో తనదైన గాత్రంతో... పాటలకు ప్రాణం పోసేవారు. చిత్ర పరిశ్రమలో అపర ఘంటసాల గా పేరొందిన రామకృష్ణ... సుమధుర గాత్రంతో ప్రేక్షకుల మదిలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: