హెరాల్డ్ బర్త్ డే : 13-08-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen
ఆగస్టు 13వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు  జరిగాయి.మరి  ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు  జన్మించిన ప్రముఖులు ఎవరో  తెలుసుకుందాం రండి.

 రేణుకా చౌదరి జననం : కాంగ్రెస్ నాయకురాలు మాజీ మంత్రి అయిన రేణుకాచౌదరి 1954 ఆగస్టు 13వ తేదీన జన్మించారు. మాజీ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కూడా రేణుకాచౌదరి పనిచేశారు. 1984లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు రేణుకాచౌదరి. 86 నుంచి 98 వరకు రెండు సార్లు రాజ్యసభ సభ్యురాలిగా కూడా పనిచేశారు, 1998 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ లో చేరిన రేణుకాచౌదరి... ఖమ్మం లోకసభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. హెచ్.డి.దేవెగౌడ ప్రభుత్వంలో ఈమె కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కూడా ముందుగా 2004 సంవత్సరంలో కేంద్ర పర్యాటక మంత్రిగా ఆ తర్వాత సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.


 శ్రీదేవి జననం : భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి శ్రీదేవి 1963 ఆగస్టు 13వ తేదీన జన్మించారు. తెలుగు హిందీ తమిళం మలయాళం భాషల్లో వందలాది సినిమాల్లో నటించి అగ్ర కథానాయకులతో ఒక వెలుగు వెలిగారు శ్రీదేవి. అందం అభినయం నటన తో ఎంతో మంది సినీ అభిమానులను సంపాదించుకున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో శ్రీదేవి అతిలోకసుందరి గా అభివర్ణిస్తూ ఉంటారు. బాలనటిగా తన నట జీవితాన్ని ప్రారంభించిన శ్రీదేవి.. ఆ తర్వాత కథానాయికగా తిరుగులేని ప్రస్థానం కొనసాగింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఎన్నో మైలురాళ్లు వంటి సినిమాల్లో నటించారు శ్రీదేవి.

 షోయబ్ అక్తర్ జననం : పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు... ఫాస్ట్ బౌలింగ్ లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆటగాడు అయిన షోయబ్ అక్తర్ 1975 ఆగస్టు 13వ తేదీన జన్మించారు. అయితే పాకిస్థాన్ జట్టులో మంచి ఆటగాడిగా ఉన్నప్పటికీ వివాదాలతో పలుమార్లు జట్టు నుంచి తొలగించబడ్డారు షోయబ్ అక్తర్. ఏకంగా నిబంధనలను ఉల్లంఘించే విధంగా ఉన్న తన ప్రవర్తన కారణంగా పాకిస్తాన్ క్రికెట్ బూతు షోయబ్  అక్తర్ను 5 సంవత్సరాల పాటు నిషేధం విధించింది.

 అజయ్ భూపతి జననం : భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి 1986 ఆగస్టు 13వ తేదీన జన్మించారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరియర్ ప్రారంభించి భూపతి.. రామ్ గోపాల్ వర్మ వద్ద పలు సినిమాలకు పని చేశారు. తర్వాత ఆర్ఎక్స్ 100 అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమైన అధిపతి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు అజయ్ భూపతి. .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: