హెరాల్డ్ బర్త్ డే : 11-08-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen
ఆగస్టు 11వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే  ఎంతో మంది ప్రముఖుల జననాలు  జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు  తెలుసుకుందాం రండి.

 ఎక్కిరాల కృష్ణమాచార్య జననం : ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ రచయిత ఎక్కిరాల కృష్ణమాచార్య 1926 ఆగస్టు 11వ తేదీన జన్మించారు, గుంటూరు జిల్లాలో జన్మించిన కృష్ణమాచార్య.. తెలుగు సంస్కృత ఆంగ్ల బాషలలో పాండిత్యాన్ని సాధించారు. ముఖ్యంగా పాండురంగ మహత్యం కావ్యం పై పరిశోధన చేసి ఒక అద్భుతమైన గ్రంథాన్ని వెలయించి డాక్టరేట్ సాధించాడు. గుంటూరులోని హిందూ కళాశాలలో తర్వాత ఆంధ్ర విశ్వకళా పరిషత్తు లోని తెలుగు ఉపన్యాసకుడిగా కూడా పనిచేశారు కృష్ణమాచార్య. వీరి రచనలలో ఎక్కువగా రాసలీల ఋతురాగాలు గోదా వైభవం అశ్వద్ధామ సుభద్ర  స్వయంవరం పురాణ పురుషుడు లాంటి ఎన్నో రచనలు ఎంతగానో ప్రేక్షకాదరణ పొందాయి, ఈయన ఐరోపాలో పర్యటించి సనాతన భారత ధర్మానికి అక్కడ ప్రచారం కల్పించారు. అంతేకాకుండా జగద్గురువుగా కూడా ఖ్యాతిగాంచారు కృష్ణమాచార్య.

 దువ్వూరి సుబ్బారావు జననం : భారతీయ రిజర్వు బ్యాంకు 22వ గవర్నర్ గా  నియమితులయిన దువ్వూరి సుబ్బారావు ఆగస్టు 11 1949వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. అమెరికాలోని ఓహియో విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్ పట్టా పొందిన దువ్వూరి సుబ్బారావు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో టాపర్ గా  నిలిచారు. ఈయన  నెల్లూరు జాయింట్ కలెక్టర్ గా ఖమ్మం జిల్లా కలెక్టర్ గా  బాధ్యతలు నిర్వహించాడు. తర్వాత కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలో కూడా జాయింట్ సెక్రటరీగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగా కూడా పనిచేశారు .  2004 నుంచి 2008 వరకు ఆర్థిక కార్యదర్శిగా పనిచేసిన తర్వాత భారత దేశ కేంద్ర బ్యాంకు  రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా  కూడా నియమితులై ఆ పదవిలో 2013 సెప్టెంబర్ 4 వరకు పనిచేశారు.

 మేక వెంకట ప్రతాప్ అప్పారావు జననం : ప్రముఖ రాజకీయ నాయకుడు అయిన మేక ప్రతాప్ వెంకట ప్రతాప్ అప్పారావు 1950 ఆగస్టు 11వ తేదీన జన్మించారు. ఈయన నూజివీడు శాసనసభ నియోజకవర్గం నుంచి శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు, వైయస్ఆర్ పార్టీలో చేరకముందు ఈయన కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా కూడా ఉన్నారు. ఆంధ్ర రాజకీయాలలో కీలక పాత్ర పోషించిన మేక వెంకట ప్రతాప్ అప్పారావు... రాజకీయాల్లో పలు పదవులను కూడా అలంకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: