హెరాల్డ్ బర్త్ డే : 05-08-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen
ఆగస్టు 5వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు  జరిగాయి. ఒక సారి చరిత్రపుటల్లోకి వెళ్లి  నేడు  జన్మించిన ప్రముఖులు ఎవరో  తెలుసుకుందాం రండి.


 తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి జననం : లలిత త్రిపుర సుందరి పాఠకులు అయినా తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి 1896 ఆగస్టు 5వ తేదీన జన్మించారు. 8 సంవత్సరాల వయసు నుంచి వెంకటప్పయ్య శాస్త్రి ఉపనయనం చేశారు, అయితే యవ్వనంలోనే సన్యాసం పుచ్చుకోవాలని కోరుకున్న ఈయన.. తల్లి మాత్రం సన్యాసం తీసుకునేందుకు అనుమతించలేదు.


 చక్రపాణి జననం : బహుభాషావేత్త తెలుగు రచయిత పత్రికా సంపాదకులు సినీ నిర్మాత దర్శకుడు అయిన చక్రపాణి 1908 ఆగస్టు 5వ తేదీన జన్మించారు. మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన చక్రపాణి..  విజయ ప్రొడక్షన్స్ స్థాపించి సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నారు. ఇక వాహిని స్టూడియో ద్వారా తెలుగు తమిళ కన్నడ హిందీ భాషలలో దాదాపు 35 చలనచిత్రాలను రూపొందించారు చక్రపాణి . షావుకారు పాతాళభైరవి మాయాబజార్ గుండమ్మకథ ఇలాంటి మరుపురాని సినిమాలు నిర్మించారు చక్రపాణి

 కాజోల్ జననం :  భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ నటి కాజోల్ 1974 ఆగస్టు 5వ తేదీన జన్మించారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు సంపాదించారు .  షారుక్ ఖాన్ కాజోల్ జోడి బాలీవుడ్ లో హిట్ పెయిర్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. కాజోల్ కుటుంబం కూడా చిత్ర పరిశ్రమ కు చెందినది కావడం గమనార్హం. తల్లిదండ్రులిద్దరూ సినిమా పరిశ్రమకు చెందినవారు కావడంతో పదహారేళ్లకే తొలి అవకాశాన్ని దక్కించుకుంది కాజోల్. ఇక ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. చదువు పూర్తి కాకముందే చదువులకు గుడ్ బై  చెప్పి పూర్తిగా సినిమా వైపు దృష్టి పెట్టింది కాజోల్ . విజయవంతమైన సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.

 జెనీలియా జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి అయిన జెనీలియా 1982 ఆగస్టు 5వ తేదీన జన్మించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన జెనీలియా తెలుగుతో పాటు తమిళం హిందీ కన్నడ భాషల్లో కూడా ఎంతగానో గుర్తింపు  సంపాదించారు. ముఖ్యంగా జెనీలియా నటించిన బొమ్మరిల్లు సినిమా తెలుగు ప్రేక్షకులకు జెనీలియా ను ఎంతగానో దగ్గర చేసింది. అంతే కాకుండా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన  సై  సినిమాలో కూడా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులు అందరినీ ఎంతగానో మెప్పించని జెనీలియా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: